- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాధవ్ గాడ్గిల్ (83) బుధవారం రాత్రి పూణెలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ఆయన విశేష కృషి చేశారు. 2024 సంవత్సరానికి గాను ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్’ ఆయనకు లభించింది.
- Advertisement -



