- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టుకు ఆయన కోచ్‌గా సేవలు అందించనున్నారు. జనవరి 18న రాథోడ్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రపంచకప్ పూర్తయ్యే వరకు, అంటే మార్చి 10 వరకు ఆయన లంక జట్టుతోనే ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాథోడ్ భారత్ తరపున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడారు. 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు.
- Advertisement -



