Thursday, May 22, 2025
Homeఅంతర్జాతీయంయుఎఇలో అఖిలపక్ష ప్రతినిధి బృందం

యుఎఇలో అఖిలపక్ష ప్రతినిధి బృందం

- Advertisement -


న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: శివసేన ఎంపి శ్రీకాంత్‌ షిండే నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం గురువారం అబుదాబిలో యుఎఇ మంత్రి షేక్‌ నహాయన్‌ మబారక్‌ అల్‌ నహ్యాన్‌తో సమావేశమైంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్త మద్దతు కోరుతూ ఒక బృందం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన ప్రాముఖ్యతను, రాజకీయ పార్టీల వైవిధ్యాన్ని ప్రతినిధి బృందం అధ్యక్షులు శ్రీకాంత్‌ షిండే హైలెట్‌ చేశారు. భారతదేశ వైఖరిని ప్రపంచానికి ప్రదర్శించడం చాలా కీలకమని అన్నారు. యుఎఇ మరియు పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లే బృందానికి తాను నాయకత్వం వహించడం తన అదృష్టమని అన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి మద్దతు మరియు నిధులు అందించడంతో సహా భారత్‌ చాలా కాలంగా ఎదుర్కొంటున్న ముప్పు గురించి ప్రపంచానికి సందేశం ఇవ్వడం ముఖ్యమని అన్నారు. భారతదేశం, పాకిస్తాన్‌ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. కానీ భారతదేశం ఆర్థికంగా పురోగతి సాధించింది. అయితే పాకిస్తాన్‌ ఉగ్రవాదంలో మాత్రమే పురోగతి సాధించిందని అన్నారు. బిజెపి నేత ఎస్‌ఎస్‌ అహ్లూవాలియా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ తప్పుడు సమాచార ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తగా బహిర్గతం చేయడమే బృందం లక్ష్యమని అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశం ఐక్యంగా ఉందన్న బలమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -