Friday, May 23, 2025
Homeజాతీయంఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తి ఎంటో పాక్ కు తెలిసింది: మోడీ

ఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తి ఎంటో పాక్ కు తెలిసింది: మోడీ

- Advertisement -

వతెలంగాణ – హైదరాబాద్ : హల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని తెలిపారు. “ఏప్రిల్ 22 నాటి దాడికి ప్రతిస్పందనగా మే 7న చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చెందిన 9 అతిపెద్ద స్థావరాలను 22 నిమిషాల్లో ధ్వంసం చేశాం. సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం” అని మోడీ చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రతీకార చర్యలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆయన పేర్కొన్నారు. “నా నరాల్లో రక్తం కాదు, సిందూరం మరుగుతోంది” అని మోడీ ఉద్ఘాటించారు. “ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా ఉంది. పహల్గామ్ దాడి తూటాలు 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో గుచ్చుకున్నాయి. మేం ఉగ్రవాదపు గుండెల్లోనే దెబ్బకొట్టాం. ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మన సాయుధ దళాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయి” అని ప్రధాని వివరించారు. ఈ కార్యక్రమానికి ముందు, ప్రధాని మోడీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన దేష్నోక్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే, బికనీర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం దేష్నోక్‌లోని ప్రసిద్ధ కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -