Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంఅమిత్ షా ఇంటి ఎదుట టీఎంసీ ఎంపీల ఆందోళ‌న‌లు

అమిత్ షా ఇంటి ఎదుట టీఎంసీ ఎంపీల ఆందోళ‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా ఇంటిని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ముట్టడించారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ కక్షలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మీడియాతో టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మాట్లాడారు.. ఈడీ తప్పుగా సోదాలు నిర్వహించింది. ఇది అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న ప్రయత్నిస్తోందన్నారు. మరో ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ.. ‘‘నిన్న ఈడీ బృందాన్ని పంపారు. ఎన్నికల సమయంలోనే వారికి అన్నీ గుర్తుకొస్తాయి. కేవలం గెలవడం కోసమే ఎన్నికల సమయంలో ఈడీ, సీబీఐ బృందాలను పంపుతారు. కానీ వారు ఎన్నికలలో గెలవలేరన్నారు.

ఐ-ప్యాక్ డైరెక్టర్ ఇంటిపై ఈడీ సోదాలు చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడుల‌ను వ్య‌తిరేకిస్తూ ఆమె నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని అమిత్ షా అధికార నివాసం ముందు ఆ పార్టీ ఎంపీలు ధ‌ర్నా చేప‌ట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -