Saturday, January 10, 2026
E-PAPER
Homeనిజామాబాద్అంక్సాపూర్ ఉన్నత పాఠశాలకు కుర్చీలు , స్టీల్ ప్లేట్ల వితరణ 

అంక్సాపూర్ ఉన్నత పాఠశాలకు కుర్చీలు , స్టీల్ ప్లేట్ల వితరణ 

- Advertisement -

నవతెలంగాణ -(వేల్పూర్) ఆర్మూర్
 జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల అంక్సాపూర్ జిహెచ్ఎం ఆర్ మల్లీశ్వరి  అధ్యక్షతన  , వివిధ పాఠశాలలు పనిచేసే ఈ మధ్యనే పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయురాలు శ్రీమతి సరస్వతి, , శ్రీమతి అంబుజా , శ్రీమతి గంగామణి  ఇచ్చిన ఆర్థిక సహకారంతో పాఠశాలకు కావలసిన 20 కుర్చీలను శుక్రవారం అందజేసినారు. వారికి ఈ సందర్భంగా ప్రధా నోపాధ్యాయురాలు , ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలుతెలిపారు.   ఈ పాఠశాలలో చదివి న విద్యార్థి రత్నపురం అక్షయ్ పడగల్ పాఠశాలకు అవసరం నిమిత్తం 50 స్టీల్ ప్లేట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిహెచ్ఎం గారు మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన కనీస అవసరాలను ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తూ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నందుకు వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్ ,శ్రీదేవి, రాజేంద్ర, కాంతయ్య శ్రీలక్ష్మి దేవరాజ్ సదాశివ్ వినోద్ యమునా దేవ సుకన్య జాన్సన్ వేణుగోపాల్ రెడ్డి రాజు సిఆర్పి మూర్తి  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -