Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్పిడుగుపాటుతో మృతిచెందిన గొర్రెల కాపర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ప్రకటించాలి

పిడుగుపాటుతో మృతిచెందిన గొర్రెల కాపర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ప్రకటించాలి

- Advertisement -
  • – భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్
    నవ తెలంగాణ – మల్హర్ రావు
  • పిడుగుపాటుతో  మృతి చెందిన గొర్లకాపర్ల కుటుంబాలకు రూ.10  ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సిద్ధి రమేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలో మాట్లాడారు. మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండలం  ఓటాయి గ్రామంలో  నిన్న కురిసిన అకాల వర్షం, పిడుగుపాటుతో గొర్ల కాపరి ఏషబోయిన చేరాలు యాదవ్ మృతి చెందడం జరిగింది.  మృతి చెందిన గొర్ల కాపరి ఏషబోయిన చేరాలకు ప్రభుత్వం తరపున పది లక్షల ఎక్స్  గ్రేషియా  ప్రకటించాలని కోరారు.1994లో గొర్ల కాపర్ల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 559, 1016 జీవోలను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యకం చేశారు. వెంటనే గొర్ల కాపరులకు ఇచ్చిన జీవోలను అమలుపరచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుతో  మరణించిన ప్రతి గొర్ల కాపరి కుటుంబానికి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -