నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కవితల పోటీలను జూన్ రెండవ తేదీన మండల కేంద్రంలోని మేదరి వాడ హనుమాన్ టెంపుల్ దగ్గర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ కవితల పోటీలలో పాల్గొనాలన్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 1116, రెండవ బహుమతిగా 516 మూడవ బహుమతిగా 316 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కవితల పోటీలలో బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు విద్య ఉద్యోగాలు ప్రమోషన్లు 50 శాతం రిజర్వేషన్లు, తదితర బీసీ అంశాలపై నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న కవులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలలో గెలుపొందాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు క్రింది నెంబర్లను సంప్రదించాలన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కవితల పోటీలు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES