Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎలాన్ మ‌స్క్‌కు భారీ షాక్.. గ్రోక్‌పై నిషేధం

ఎలాన్ మ‌స్క్‌కు భారీ షాక్.. గ్రోక్‌పై నిషేధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్ కు ఇండోనేషియా ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. గ్రోక్‌ (Grok) చాట్‌బాట్‌ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది. డిజిటల్‌ వేదికలో వస్తోన్న అసభ్యకర కంటెంట్‌ను మానవ హక్కులు, గౌరవం, పౌరుల భద్రతా ఉల్లంఘనగా తమ ప్రభుత్వం చూస్తోందని ఇండోనేసియా మంత్రి మోత్యా హఫీద్‌ పేర్కొన్నారు. ఈ చర్యలు తీసుకున్న తొలి ముస్లీం దేశంగా ఇండోనేషియా నిలిచింది. అయితే, ఎక్స్‌లోని గ్రోక్‌ చాట్‌బాట్‌లో అసభ్యకర కంటెంట్‌కు సంబంధించి భారత్‌ కూడా ఇటీవల తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అటువంటి కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించడంతోపాటు తీసుకున్న చర్యలపైనా నివేదిక కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -