Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు సాహిత్యానికి దొరికిన డెల్ స్పెండర్స్ మృణాళిని

తెలుగు సాహిత్యానికి దొరికిన డెల్ స్పెండర్స్ మృణాళిని

- Advertisement -

ఈ కాలానికి టి.ఎల్.కాంతారావుని గుర్తు చేసుకోవడం అవసరమని కవి, విమర్శకులు సీతారాం అన్నారు. టి.ఎల్.కాంతారావు స్మారక సాహిత్య అవార్డు ప్రదానోత్సవ సభ రవీంద్రభారతి వేదికగా శనివారం జరిగింది. దీనిలో కాంతారావు సమగ్ర సాహిత్యం పుస్తకాలను రాజా రాంమోహన్ రాయ్ ఆవిష్కరించారు. వాడ్రేవుచిన వీరభద్రుడు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో టి.ఎల్.కాంతారావు పురస్కారాలను ప్రముఖ రచయిత్రి సి.మృణాళి (సాహిత్య విమర్శ), నందకిశోర్ (కవిత్వం) అందుకున్నారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ సాహిత్యంలో మృణాళిని మేరునగధీరురాలు అని కొనియాడారు. లాక్షణిక దృష్టితో విమర్శరాలిగా, పరిశోధకులుగా, అనువాదకురాలిగా కృషి చేస్తూ స్త్రీవాద కోణంలో పురాణాల, ఇతిహాసలోని విశేషమైన విషయాలను మనకు అందించారని అన్నారు. మృణాళిని తెలుగు సాహిత్యానికి దొరికిన డెల్ స్పెండర్స్ అని కొనియాడారు.

కోడూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ నందకిషోర్ కవిత్వం చదువుకొని పరవశించవలసినది అన్నారు. భాషలో సౌందర్యాన్ని, సున్నితమైన భావాలను వ్యక్తపరిచే రీతి బావుంటుందని అన్నారు. మానస చామర్తి మాట్లాడుతూ కాంతారావు తెలుగు సాహిత్యంలో విమర్శలో చేసిన లోతైన కృషిని, సంతకాన్ని గుర్తు చేశారు. దృక్పథాలకు అతీతంగా కవిత్వ రీతులను విశ్లేషించగలిగిన విమర్శకుల అవసరాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తలగడదీవి శైలజ, కాంతారావు కుటుంబ సభ్యులు, ఎస్.రఘు, ప్రసేన్, నవీన్, పేర్ల రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -