Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌-విజయవాడ హైవేపై పెరిగిన రద్దీ

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పెరిగిన రద్దీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వేకువజాము నుంచి రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎక్కువ టోల్‌ బూత్‌లను ఓపెన్‌ చేశారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 70వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్‌ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఇవాళ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -