Monday, January 12, 2026
E-PAPER
Homeక్రైమ్చంపాపేట్‌ డీ-మార్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

చంపాపేట్‌ డీ-మార్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చంపాపేట్‌లోని డీ-మార్ట్ సమీపంలోని భవానీ పెయింట్స్ షాప్ ఎదుట ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 9:45 గంటలకు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఐ.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ హెచ్.గణేష్ (పీ.సి. నం. 30163)కు 100 నంబర్ ద్వారా సమాచారం అందింది. భవాని పెయింట్స్ షాప్ ఎదుట, బర్గర్ కింగ్ సమీపంలో ఓ వ్యక్తి స్పృహలేని స్థితిలో పడి ఉన్నాడని తెలియడంతో ఆయన తక్షణమే అక్కడికి చేరుకున్నారు.

అక్కడ పరిశీలించగా సదరు వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా, వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించగా, ఆ వ్యక్తి ఇప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుని ప్రాథమిక వివరాల ప్రకారం.. అతడు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు, 5.2 అడుగుల ఎత్తు, లేత క్రీమ్ రంగు టీ-షర్ట్ మరియు నీలం రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ముఖంపై గాయాల గుర్తులు కనిపించగా, కళ్ళు మరియు నోరు మూసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు హిందువుగా అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఓజీహెచ్ మార్ట్యూరీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుని గుర్తింపు, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రజల సహకారం కోరుతున్న పోలీసులు, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే లేదా అతని గురించి సమాచారం తెలిసి ఉంటే వెంటనే ఐ.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ – 100 / 112 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -