- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగ పనులను ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను తొలగించిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లిస్తామని నిర్మాణ సంస్థకు హామీ ఇచ్చారు.
- Advertisement -



