Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలునష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లపై బేర్‌ పట్టు కొనసాగుతోంది. రష్యా చమురును దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా టారిఫ్‌లు ఎలా ఉంటాయన్న దానిపై అనిశ్చితి సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. అటు కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్ల అప్రమత్తత మార్కెట్‌ను ఒత్తిడికి గురిచేస్తోంది. దీంతో సోమవారం నాటి సెషన్‌లో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 25,600 మార్క్‌ను కోల్పోయింది.
ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 419 పాయింట్లు దిగజారి 83,156 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల నష్టంతో 25,559 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి 90.23గా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -