నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుడిలోని బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దేవాలయం వెనుక ద్వారం నుంచి వచ్చిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లుగా సోమవారం ఆలయ సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఆలయ ధర్మకర్త ముకుంద పండా సమాచారం అందించారు.
దొంగతనానికి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.60 లక్షల విలువైనవి అని ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఆలయంలో చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, కాశీబుగ్గలో గత ఏడాది నవంబర్ 1వ తేదీన ఏకాదశి పర్వదినాన భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే.



