నవతెలంగాణ – హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాతూ..పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్‌దే. నిజామాబాద్ నగరంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. గతంలో పేదవాడి సొంతింటి కల నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తోంది. రెండో దశలోనూ మంజూరు చేస్తాం. జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తాం. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓట్ల రూపంలో మారనుంది. ప్రధాని మోడీ హయాంలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. “దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీ సంస్కృతి. కాంగ్రెస్‌కు అలాంటి అలవాటు లేదు. బీజేపీ నేతలు తాము చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడగాలి” అని ఆయన సవాల్ విసిరారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: టీపీసీసీ చీఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



