Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభర్త ఇంటి ముందు భార్య ధర్నా

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో, వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు మొదటి భార్య ధర్నాకు దిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి చరణ్, శిల్ప దంపతులు 15 ఏండ్ల క్రితం వివాహం చేసుకోగా, ఐదేళ్లుగా భర్త కనిపించకుండా తిరుగుతున్నాడు. భర్త బండ్లగూడలో ఉంటున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి.. భార్య భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -