- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా చూస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంతోషంగా సినిమా చూడటానికి వచ్చిన వ్యక్తి శవమై తిరిగిరావడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్లో ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ప్రదర్శితమవుతోంది. తన అభిమాన హీరో సినిమా కావడంతో ఆనంద్ కుమార్ అనే వ్యక్తి టికెట్ బుక్ చేసుకుని థియేటర్‌కు వచ్చారు. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై తన సీట్లోనే కుప్పకూలిపోయారు.
- Advertisement -



