కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
ఆధునీకరించిన 103 రైల్వేస్టేషన్లు ప్రారంభం
నవతెలంగాణ-కరీంనగర్
తమ ప్రభుత్వ హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయనడానికి కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణే నిదర్శనమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునీకరి ంచిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా కరీం నగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధి కారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్‌భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు. కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు 61 కి.మీల నూతన రైల్వేలైన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశామన్నారు. ఈ నూతన లైన్ నిర్మాణానికి రూ.1480 కోట్లు అవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారని, దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా రూ.25 వేల కోట్లతో 1350 రైల్వేస్టేషన్లను ‘అమృత్ భారత్’ పథకం కింద ఆధునీకరిస్తున్నామని, వీటిలో రూ.2వేల కోట్లతో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించుకోవడం సంతోషదాయకమని అన్నారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగు ణంగా ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం ఎంతో అవసరం అన్నారు. తాను ఎంపీగా ఉన్న సందర్భంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు వారానికి రెండుసార్లు మాత్రమే ఉందని, ఈ రైలును కనీసం వారానికి నాలుగు రోజులు నడపాలని కోరారు.
జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES