- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణంలోని సాయి టెక్నికల్ ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు ఆ సంస్థ చైర్మన్ జక్కుల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మైత్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ మధురిల చేతుల మీదుగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ ఇన్చార్జి సంధ్యారాణి, కంప్యూటర్ ఇంచార్జి ప్రసన్న,ఇన్స్టిట్యూట్ ఇన్చార్జి రమణయ్య, కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



