Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ తాజ్ పూర్

స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ తాజ్ పూర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ తాజ్ పూర్ లక్ష్యంగా సోమవారం  తాజ్ పూర్ గ్రామంలో సుమారు క్వింటాలు చెత్త మోయగల తడి చెత్త -పొడి చెత్త ట్రాలీ చెత్త డబ్బాలను  (డస్ట్ బిన్ )గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ , ఉపసర్పంచ్, వార్డు సభ్యులు  ఏర్పాటు చేశారు.  ఇందులో భాగంగా ఈ చెత్త డబ్బాలను (డస్ట్ బిన్ )గ్రామంలో చెత్త సేకరణ వాహనం తిరగడానికి ఇబ్బంది గా ఉన్న గళ్లీలలో, జనం ఎక్కువగా ఉండే చౌరస్తా లలో అధిక చెత్త జమయ్యే ప్రదేశాలలో ఉంచడానికి నిర్ణయించిన్నట్లు,  గ్రామ ప్రజలు తడి చెత్త -పొడి చెత్త ను సూచించిన డబ్బాలలో వేయవలెను.వాటిని వినియోగించు కోకుండా నిర్లక్ష్యం గా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసినచో సీసీ కెమెరా ల ద్వారా పరిశీలించి వారికి గ్రామపంచాయతీ 500/-నుండి 1000/-వరకు జరిమానా వేయాలని నిర్ణయించడమైనది.. కావున గ్రామప్రజలు సహకరించి గ్రామాన్ని పరిశుభ్రత లో అగ్ర స్థానంలో ఉంచాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -