Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలను పాడి రైతులు  సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలను పాడి రైతులు  సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
 ప్రభుత్వం కల్పించే ప్రోత్సకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని బి ఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి కోరారు. సోమవారం బిఎన్ తిమ్మాపురం గ్రామంలో ఉన్న పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ను ఏర్పాటు చేయగా, ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో ఉన్న పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా చూసుకోని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని  కోరారు.ఈ సందర్భంగా పశువుల డాక్టర్ ప్రత్యూష రెడ్డి, జహంగీర్ లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామ పాడి రైతులకు అందుబాటులో ఉండి, పశువువులకు కావాల్సిన మందులు ఏర్పాటు చేయాలని వారికి అన్నివిధాలుగా సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉడుత శారదా ఆంజనేయులు, వార్డు సభ్యులు జూపల్లి నర్సింహ, ఉడుత మణికంఠ, తోటకూరి రమేష్, జిన్న నర్సింహ, తోటకురి పాండు, మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్, పాల సంగం చైర్మన్ జిన్న ధనరాజ్, గొర్లకాపార్ల సంగం అధ్యక్షులు గజ్జి నర్సింహ, మాజీ పాలసంగం చైర్మన్ గూడూరు బాల్ రెడ్డి, మాజీ స్కూల్ చైర్మన్ ఉడుత మహేందర్, యూత్ అధ్యక్షులు  బాబా, రావుల మహిపాల్, చంద్రం, మునీర్ పాడి రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -