Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే తన వద్ద ఉంచుకోవడం సరైంది కాదు

కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే తన వద్ద ఉంచుకోవడం సరైంది కాదు

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి 
– ప్రశాంత్ రెడ్డి అహంకార వైఖరికి నిదర్శనం 
– లబ్ధిదారులకు వెంటనే చెక్కులను అందజేయాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రోజు బాల్కొండకు వెళ్ళని లబ్ధిదారుల చెక్కులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన వద్ద ఉంచుకోవడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్యతో కలిసి ఆయన మాట్లాడారు.నాలుగు రోజుల క్రితం బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేసి నియోజకవర్గానికి మంజూరైన కళ్యాణలక్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయితే కమ్మర్ పల్లి, ఇతర మండలాలనుండి కొందరు లబ్ధిదారులు బాల్కొండ దూరంగా ఉండడం వల్ల, ఇంకా వేరే కారణాల వల్ల అట్టి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారన్నారు. అలాంటి వారికి ప్రభుత్వ అధికారి తహసిల్దార్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయవలసి ఉంటుందన్నారు.అలా కాకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మళ్ళీ ఒకరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి నేనే పంచుతాను అని చెప్పడం జరిగిందని అది సరైన పద్ధతి కాదన్నారు. అది అయన అహంకార వైఖరికి నిదర్శనం అన్నారు. పేద కుటుంబాలకు వివాహం నిమిత్తం చేదోడు వాదోడుగా ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ప్రభుత్వం అందించే సాయం పట్ల వాళ్ళు ఆశతో ఎదురుచూస్తారన్నారు. అలా మంజూరైన చెక్కులను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే తన వద్దనే ఉంచుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణలక్ష్మి చెక్కుల సంతకాలకు, మంజూరైన చెక్కులు పంపిణీ చేసే సమయంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, లబ్ధిదారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హయంలో నిష్పక్షపాతంగా, నిస్వార్థంతో ఏ పథకాలైనా లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన అహంకార వైఖరిని మానుకొని, ప్రభుత్వ సాయం కోసం ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు మంజూరైన వెంటనే చెక్కులను తహసిల్దార్ ద్వారా అయినా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాగాపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, నిమ్మ ప్రసాద్, బుచ్చి మల్లయ్య, అజ్మత్ పాషా, వేములవాడ జగదీష్, పాలెం చిన్న గంగారాం, అజార్, శైలేందర్, దీపక్, వినీల్, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -