నవతెలంగాణ-పరకాల: పరకాల పట్టణంలోని సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటిజన్ ఫోరం కన్వీనర్ డాక్టర్ నాగబండి విద్యాసాగర్ వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువత సోషల్ మీడియాకు బానిస కాకుండా, దానికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను కేవలం తమ భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడే సాధనంగా మాత్రమే మార్చుకోవాలని ఆయన కోరారు. వివేకానందుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన సూక్తులను పాటిస్తూ భారతదేశ పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఆర్పి. జయంత్ లాల్, మడికొండ సంపత్ కుమారి, తమ్మిశెట్టి వెంకన్న, ఉందె వెంకన్న, పల్నాటి రాజేందర్, శ్రీధర్, వేముల అశోక్, నరేందర్, మడికొండ మహేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
ఘనంగా స్వామి వివేకానంద జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



