- Advertisement -
నవతెలంగాణ-వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నిర్వహించనున్న వాలీబాల్ టోర్నమెంట్‌కు.. గ్రామ కాంగ్రెస్ నాయకులు గోకంమల్ల కరుణాకర్ క్రీడాకారులకు సోమవారం ఐమాక్స్ లైట్లు అందజేశారు. ఈ సందర్బంగా కర్ణాకర్ మాట్లాడుతూ.. గ్రామ యువకులకు అన్ని విషయాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.
- Advertisement -



