– ప్రజల స్వయం నిర్ణయ హక్కును నమ్ముతాం
– గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఇది ఒక నిర్ణయాత్మక క్షణం
– ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్‌సెన్
డెన్మార్క్ : గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకు నేందుకు అవసరమైతే బలప్రయోగం కూడా చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించిన నేపథ్యంలో డెన్మార్క్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్ సెన్ స్పందించారు. ఇది గ్రీన్ ల్యాండ్ విషయంలో ఒక తుది నిర్ణయాత్మక క్షణం అని అన్నారు. ఈ వివాదంలో ఉండే పరిణామాలు చాలా తీవ్రమైనవని చెప్పారు. వాషింగ్టన్‌లో జరగబోయే కీలక సమావేశాలకు ముందు మాట్లాడిన ఆమె.. గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఒక స్పష్టమైన సంఘ ర్షణ ఉన్నదని చెప్పారు. ”మా విలువలను కాపాడుకు నేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆర్కిటిక్ ప్రాంతంలో కూడా. మేము అంతర్జాతీయ చట్టా లను, ప్రజల స్వయం నిర్ణయ హక్కు ను నమ్ముతాం” అని ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు.
డెన్మార్క్‌కు యూరప్ దేశాల మద్దతు
ట్రంప్ తాజా వ్యాఖ్యలపై జర్మనీ, స్వీడన్‌లు డెన్మార్క్‌కు బహి రంగ మద్దతును ప్రకటిం చాయి. అమెరికా చేస్తున్న బెదింపులను స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ తీవ్రంగా ఖండించారు. ”గ్రీన్ ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసు కోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. ఇది ఇతర దేశాలను కూడా ఇలాగే వ్యవహరించేందుకు ప్రోత్సహించే ప్రమాదం ఉన్నది” అని క్రిస్టర్‌సన్ హెచ్చరించారు. స్వీడన్, నార్డిక్ దేశాలు, బాల్టిక్ దేశాలు, అనేక ప్రధాన యురోపియన్ దేశాలు డెన్మార్క్‌కు అండగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు.
నిర్ణయ హక్కు డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్‌లకే.. జర్మనీ
వాషింగ్టన్ చర్చలకు ముందు జర్మనీ కూడా తన మద్దతును పునరుద్ఘాటించింది. గ్రీన్‌ల్యాండ్ భూభాగం, సార్వభౌమత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌కే ఉన్నదని జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్ తెలిపారు.
మా విలువలు కాపాడుకునేందుకు సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



