- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా రఘునాథపాలేం మడలంలో మంచుకొండ ఎత్తిపోతలను మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రైతుల పాదాలను గోదావరి జలాలలో కడగడమే తన జీవిత లక్ష్యమని అన్నారు. కరువు మండలంగా ఉన్న రఘునాథపాలేం వచ్చే మూడేళ్లలో పచ్చని పంటలతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. కాగా సాగర్ జలాలను మళ్లించి 2 పంటలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
- Advertisement -



