Tuesday, January 13, 2026
E-PAPER
Homeక్రైమ్కట్టెల లారీ బోల్తా.. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

కట్టెల లారీ బోల్తా.. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగుడ దగ్గర కర్ర చెక్కలతో వెళ్తోన్న లారీ బోల్తా పడింది. దీంతో హైదరాబాద్ -విజయవాడ హైవేపై దాదాపు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఘటనా స్థలానికి వచ్చిన వనస్థలిపురం, అబ్ధుల్లాపూర్ మెట్ ట్రాఫిక్ పోలీసులు మూడు జేసీబీలు, రెండు క్రేన్ లతో క్లియర్ చేస్తున్నారు. కర్రచెక్కలను పక్కకు తొలగిస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే సమయంలో కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ జామ్ అయినా.. కమాండ్ కంట్రోల్ కి సమాచారం అందేలా డ్రోన్లతో నిఘా పెట్టారు. ప్రజలు సేఫ్​గా గమ్య స్థానాలు చేరేలా భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మీదుగా వెళ్లే ఎన్ హెచ్ 65 రహదారిపై 24 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో పోలీస్ సిబ్బంది, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలతో పాటు డ్రోన్లను రంగంలోకి దించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -