- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిక్స్-2026 అధికారిక లోగోను విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ ఏడాది ఇండియా వేదికగా జరనున్న బ్రిక్స్ బహుపాక్షిక సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. కొత్త లోగో కమలం పువ్వును పోలి ఉంది. దీని రేకులు బ్రిక్స్ దేశాల రంగులను ప్రతిబింబిస్తాయి, ఒకే ఉమ్మడి లక్ష్యం కింద ఐక్యమైన అనేక స్వరాలను సూచిస్తాయి. కాగా,2006లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ కూటమిగా ఏర్పాడ్డాయి. గత ఏడాది ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఎఇ, ఇండోనేషియా తదితర దేశాలు ఈ కూటమిలో సభ్యదేశాలుగా చేరాయి.
- Advertisement -



