నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మకర సంక్రాంతి ( భోగి ) సందర్భంగా గెలుపొందిన విజేతలకు తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మంగళవారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలు అతి ఉత్సాహంగా పాల్గొనగా, మొదటి బహుమతి పాశం రోజా, రెండో బహుమతి దోమ్మటి భాగ్యలక్ష్మి, మూడో బహుమతి ఎల్లంకొండ అలివేల, నాలుగో బహుమతి జనగాం అనూష ఐదవ బహుమతి పుట్ట సుచిత్ర లకు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి షీల్డ్ బహుమతులను అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ నోముల పద్మ మహేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, వార్డు మెంబర్లు జనగాం ఇందిరమ్మ యాదయ్య, రత్నపురం శ్రీకాంత్, జనగాం మహేష్, రాసాల శరత్ యాదవ్, వల్లపు సతీష్ యాదవ్, ముంత కృష్ణవేణి రమేష్ యాదవ్, దోమ్మాటి భాగ్యలక్ష్మి దేవేందర్, ఎల్లకొండ అలివేలు రాజశేఖర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి లోకేష్, మాజీ ఉపసర్పంచ్ పడమటి జైపాల్ రెడ్డి, కొల్లోజు వెంకట్ చారి, గ్రామ శాఖ అధ్యక్షులు రాసాల శేఖర్ యాదవ్, ఎల్లకొండ సుధాకర్ రెడ్డి, లింగారెడ్డి, రాసాల రాజు యాదవ్, జనగాం మహేష్, రత్నపురం వెంకటేష్ జక్కిడి శేఖర్ రెడ్డి, మర్రి నరేందర్ రెడ్డి రాసాల సందీప్ యాదవ్ గడగొట్ల రమేష్,, గజ్జి వంశీ యాదవ్, పాశం ప్రసాద్ సంపంగి అర్జున్, కళ్లెం వెంకటేష్, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



