- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.
- Advertisement -



