నవతెలంగాణ-మద్నూర్: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా అరైవ్-అలైవ్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్సై రాజు తెలిపారు. ఈనెల జనవరి 13 నుండి 24 వరకు ఈ సమావేశాలు ఉంటాయని, మొదటి రోజు మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేనూర్ గ్రామంలో నిర్వహించామని ఎస్ఐ రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన మద్నూర్, డోంగ్లీ మండల గ్రామ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు గ్రామ సభలలో ప్రతీ ఒక పోలీసు అధికారి పాల్గొని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు మేనూర్ సర్పంచ్ అశోక్ పటేల్, ఉపసర్పంచ్ మాల్‌కు, మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ, తుకరం గౌడ్, సురేష్, అంజప్ప, సాయి బాబా, మొఘ సర్పంచ్ బస్వంత్ హళ్ళే, నిసార్ హుస్సేన్, అవినాష్,మీరాజ్,వెంకట్, మహారాజ్ హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.




