- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇస్రో చేపట్టిన PSLV-C62 ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ ఉపగ్రహం వేరుపడి, పని చేసింది. తమ కెస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్‌స్ట్రేటర్ (KID) క్యాప్సుల్ 3 నిమిషాల కీలక డేటాను పంపిందని స్పానిష్ స్టార్టప్ ‘ఆర్బిటల్ పారాడిజం’ ప్రకటించింది. ఫుట్‌బాల్ సైజులో ఉన్న 25 కిలోల క్యాప్సుల్ PSLV స్టేజ్-4లో విజయవంతంగా సపరేట్ అయింది. నిజానికి మూడో దశలోనే రాకెట్ విఫలమవ్వడం గమనార్హం.
- Advertisement -



