Friday, May 23, 2025
Homeతాజా వార్తలుతిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వేసవి సెలవులు కావటంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని బయట శిలతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,579 మంది స్వామివారిని దర్శించుకోగా 34,067 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.74 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -