పాలేరులో ఎర్రజెండా ఎగవేస్తాం…

– ధన బలానికి జనబలానికి మధ్య పోటీ
– రంగులు మార్చే రాజకీయాలను చిత్తుగా ఓడించాలి

– జనం కోసం నికరంగా నిలిచే వారిని గెలిపించాలి
– ఖాయం సీపీఐ(ఎం) పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నేలకొండపల్లి/ కూసుమంచి
ఈనెల 30న పాలేరులో జరుగుతున్న ఎన్నికల్లో ధన బలానికి జన బలానికి మధ్య పోటీ జరుగుతుందని ఈ ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరటం ఖాయమని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సోమవారం నేలకొండపల్లి మండలం మోటాపురం, రాజేశ్వరపురం, అమ్మగూడెం, చెన్నారం, కొత్తూరు, మండ్రాజుపల్లి, కూసుమంచి మండలం పాలేరు, నాయకన్‌ గూడెం, భగద్వీడు, బికారి తండా, ఈశ్వర మాదారం, రాజుపేట బజారు, రాజుపేట, పెరకసింగారం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విస్తృతంగా జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, మంగళహారతులు, పూలమాలలతో తమ్మినేనికి జనం నీరాజనం పలికారు. ఆయా గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో బూర్జువా పార్టీలు భారత రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించేలా, ప్రజాస్వామ్య విలువలను మంట కలిసేలా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌
శక్తులు రాజకీయాలలో చేరి కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ యోజనాల కోసం అధికార దాహంతో పూటకో పార్టీ మారుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ వ్యక్తులు చట్టసభలకు వెళ్లడంతో పేదల సమస్యలు పట్టింపు లేదన్నారు. అసెంబ్లీలో ఏనాడు ప్రజా సమస్యలపై గల మెత్తని వారిని, అవకాశవాదం డబ్బు మదం అహంకారంతో రంగులు మార్చే రాజకీయాలను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. పాలేరు ఎన్నికల్లో అవకాశవాద, కార్పొరేట్‌ వ్యక్తులు పోటీ చేస్తున్నారని, వారు గతంలో ఏ పార్టీలో ఉన్నారో, నేడు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో, రేపు మరే పార్టీలోకి చేరుతారో చెప్పుకోలేని, నమ్మకం లేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. జనం సమస్యలు మరచి నిద్రపోయే వ్యక్తులకు ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వడం వల్ల ప్రయోజనం శూన్యమన్నారు. జనం వెన్నంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నికరంగా నిలుస్తున్న తనకు ఓటు వేసి గెలిపించడం ద్వారా చట్టసభలలో ప్రజావాణి వినిపిస్తానన్నారు. రాజకీయాలంటేనే పరిచయం లేని వ్యక్తి 2014లో సీపీఐ(ఎం) దయతో ఎంపీగా ఎన్నికై డబ్బు అహంకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లను గెలిచి తీరుతానని శబదాలు చేసే వ్యక్తి, ముందు తన గెలుపు సంగతి ప్రశ్నార్ధకంగా మారుతున్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. పాలేరు ప్రజలు చాలా చైతన్యవంతమైన వారని నీ ఊసరవెల్లి రాజకీయాలను ఇక్కడ సాగనివ్వరన్నారు. 2004లో ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన ఫలితాల మాదిరిగా పాలేరులో రానున్న ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరటం ఖాయమన్నారు. రాష్ట్రంలో హంగు వస్తుందని బిజెపి కలలు కంటుందని జంపు జిలానీలతో అధికారం చేపడతామన్న ఆశలు నెరవేరవేరన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇట్లాంటి జంపు జిలానీలను ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. పార్టీల విధానాలు, సిద్ధాంతాలపరంగా జనం కోసం చిన్ననాటి నుండి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమించి స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం నుంచి వచ్చి నికరంగా నిలబడుతూ జనం కోసం కలబడుతున్న తనకు ఓటు అనే ఆయుధం ఇవ్వడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌ మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గం కార్పొరేట్ల పరం కాకుండా రక్షించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు అమరవీరుల సాక్షిగా టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలను ఓడించి జనం కోసం నికరంగా నిలిచే తమ్మినేని వీరభద్రం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తమ్మినేని ప్రతి ఓటరు మదిలో నిత్యం మెదిలే వ్యక్తి అన్నారు. ప్రజా సమస్యలపై సమగ్రమైన అవగాహన కలిగి జిల్లా సమగ్ర అభివద్ధికై ఐదు నెలలపాటు పాదయాత్రలు చేయడమే కాక దళిత వాడల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్రలు చేశారన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరుతో డిజైన్‌ చేసి దాని సాధన కోసం 4000 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘంగా పాదయాత్రలు చేసి ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. పార్టీలను పక్కనపెట్టి తమ్మినేని పట్ల విశ్వాసంతో పాలేరులో ప్రజలు ఓట్లు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లడం తప్ప తాను చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో గెలిచే అసెంబ్లీ స్థానాలలో మొట్టమొదటిది పాలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, జిల్లా నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు రచ్చ నరసింహారావు, రాసాల కనకయ్య, బెల్లం లక్ష్మి, ఇంటూరి అశోక్‌ పాల్గొన్నారు. కూసుమంచి మండలంలో జరిగిన కార్యక్రమంలో మండల ఇంచార్జీ బుగ్గవీటి సరళ, మాజీ జడ్పిటిసి ఎర్రబోయిన భారతి, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, మల్లెల సన్మతరావు తోటకూరి రాజు, బిక్కసాని గంగాధర్‌, కర్ణబాబు, మూడు గన్య నాయక్‌, బాసు నాయక్‌, ఈశ్వరమాదారం కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, కంచర్ల జగన్మోహన్‌ రెడ్డి, గడ్డం మురళి పాల్గొన్నారు.

Spread the love