- Advertisement -
- జర్నలిస్టుల అరెస్టుల విషయమై డీజీపీతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్: అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి అరెస్టులు చేయడం అవసరమా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై రాష్ట్ర డీజీపీతో ఆయన మాట్లాడారు. ప్రొసీజర్ అనుసరించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదని, వారిపట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయని, పండుగ పూట అరెస్టులు సరికాదని హితువు పలికారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
- Advertisement -



