Wednesday, January 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంర‌న్నింగ్ ట్రైన్‌పై ప‌డిన క్రేన్.. 22 మంది మృతి

ర‌న్నింగ్ ట్రైన్‌పై ప‌డిన క్రేన్.. 22 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెంద‌గా, 30 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారిపడటంతో బోగీలు పట్టాలు త‌ప్పి ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. హైస్పీడ్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం నిర్మాణ పనుల్లో ఉన్న ఓ క్రేన్‌ (Crane Falls on Train) అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో కింద ఉన్న పట్టాలపై నుంచి ఓ ప్రయాణికుల రైలు వెళ్తోంద‌ని, దీంతో ప్ర‌మాదం వాటిల్లంద‌ని వెల్ల‌డించారు. క్రేన్‌ పడటంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో రైల్లో 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -