Wednesday, January 14, 2026
E-PAPER
Homeమెదక్గులాబీ జెండా ఎగరవేయడం పక్క

గులాబీ జెండా ఎగరవేయడం పక్క

- Advertisement -
  • మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
    నవతెలంగాణ-జోగిపేట: రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడం పక్క అని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకుల సమావేశం మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు నరహరి రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. అందరూ ఎన్నికలకు సమాయాత్తం కావాలని మున్సిపాలిటీ ని కైవసం చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనీ సూచించారు. ఆందోల్ మున్సిపాలిటీకి దామోదర్ రాజనర్సింహా చేసింది ఏమీ లేదని, అందుకే మళ్ళీ బిఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మాజీ డిసిసిబి ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు నారాయణ, డిబీ. నాగభూషణం, మాజీ ఎంపీపీ రామ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు సార శ్రీధర్, సీనియర్ పట్లూరి శివ శేఖర్, నాయకులు చాపల వెంకటేశం, నాగరత్నం గౌడ్, బీర్ల శంకర్, నాయి కోటి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -