- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ‘అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026’ ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ఫ్లయర్స్ తరలివచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుండి 40 మంది నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జనవరి 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, అలాగే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనున్నాయి.
- Advertisement -



