నవతెలంగాణ-మునుగోడు: మండలంలో కొంపల్లి గ్రామంలో ప్రతి పండుగకు క్రీడలను నిర్వహించడం అభినందనీయమని ఎస్సై ఇరుగు రవి అన్నారు. బుధవారం కొంపల్లిలో సంక్రాంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నామోజు రత్నాచారి సహకారంతో నిర్వహించిన వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని యువత మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రతి పోటిలో పాల్గొనే విధంగా ముందుకు గర్వకారణమన్నారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సైకి, క్రీడలకు సహకరించిన రత్నాచారికి యువకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు జాల వెంకన్న యాదవ్, బోయపర్తి లింగయ్య, గ్రామస్తులు మక్కెన అప్పారావు, జాల నాగరాజ్, మక్కెన అశోక్, డోకూరి శ్రీనివాస్ రెడ్డి, ఎం యాదయ్య, మొగుదాల శంభు, జాల మనీ, వడ్డేపల్లి శంకర్, బోయపర్తి సైదులు, బోయపర్తి సంజీవ, చింతల శ్రీను, నరేందర్, బొల్లెపల్లి వెంకన్న, స్వామి తదితరులున్నారు.
కొంపల్లిలో వాలీబాల్ పోటీల ప్రారంభించిన ఎస్సై రవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



