Wednesday, January 14, 2026
E-PAPER
Homeఆటలురెండో వ‌న్డేలో కివీస్ బౌల‌ర్ల‌ హ‌వా

రెండో వ‌న్డేలో కివీస్ బౌల‌ర్ల‌ హ‌వా

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: రెండో వ‌న్డేలో కివీస్ బౌల‌ర్ల‌ హ‌వా న‌డుస్తోంది. కేడీసీ క్లార్క్ స్పీన్ బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డ‌ర్‌ను కూప్ప‌కూలింది. మ్యాచ్ ప్రారంభం నుంచి క‌ట్టుదిట్టమైన బంతుల‌తో కివీస్ పేస్ ద్వ‌యం చెల‌రేగింది. మొద‌టి ఓవ‌ర్ లో రోహిత్ శ‌ర్మ మేడిన్ చేయ‌గా, రెండో ఓవ‌ర్ ఐదో బంతికి గిల్ ఒక ర‌న్ తీశాడు. ఇండియా ప‌రుగుల ఖాతా తెర‌వ‌డానికి 9 బంతులు వేచి చూడాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఇండియా ఓపెన‌ర్లు నెమ్మ‌దిగా ఆడుతూ పరుగులు రాబ‌ట్టారు. గిల్ ఆడ‌ప‌ద‌డ‌పా షాట్లు ఆడుతూ కీవీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు.

అయితే ఈ క్ర‌మంలో 12 ఓవ‌ర్లో రోహిత్ శ‌ర్మ(24) రూపంలో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు ఓవ‌ర్ల తేడాతోనే కెప్ట‌న్ సుభ‌మ‌న్ గిల్ అర్ధ‌సెంచ‌రీ చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన విరాట్ కోహ్లీ దూకుడు ప్ర‌ద‌ర్శించినా..క్లార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 23 ప‌రుగుతో కోహ్లీ నిరాశ‌ప‌రిచాడు. గ‌త మ్యాచ్‌లో 93 పరుగుల‌తో చెల‌రేగిన విరాట్ కోహ్లీ 23 ప‌రుగ‌ల‌కే వెనుదిరిగాడు. శ్రేయ‌స్స్ అయ్యార్ 17 బంతులు ఆడి క్రీజులో కుదురుకునే ప్ర‌య‌త్నంలోనే క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. కేడీసీ క్లార్క్ మూడు వికెట్లు, జామిస‌న్ ఒక వికెట్ తీశారు. మిగ‌తా బౌల‌ర్లు లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ తో భార‌త్ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేస్తున్నారు. బ్రేస్ వేల్ స్థానంలో కివీస్ జ‌ట్టులోకి వ‌చ్చిన జేఆర్ లెనాక్స్ ఐదు ఓవ‌ర్లు చేసి కేవ‌లం 18 ప‌రుగులే ఇచ్చాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -