Wednesday, January 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా భోగి వేడుకలు రంగవల్లుల సందడి 

ఘనంగా భోగి వేడుకలు రంగవల్లుల సందడి 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా భోగి పండుగ వేడుకలను బుధవారం ప్రజలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా మహిళలు పిల్లలు వాకిళ్లను ఊడ్చి కల్లాపు చల్లి అందమైన రంగులతో ముగ్గులు వేసి రంగులు అద్ది గొబ్బెమ్మలను ప్రతిష్టింపజేశారు. మండలంలో దాదాపు 25% ఆంధ్ర కల్చర్ ఉన్న నేపథ్యంలో వారు కూడా తెలంగాణ కల్చర్ను అలవర్చుకుంటున్నారు. క్రితం రోజే సాయంత్రం భోగి మంటలు వేయడం పాత వస్తువులను అందులో పడవేయడం ఆనవాయితీ గా మారింది. గోవు పేడతో గొబ్బెమ్మలు చేసి నవధాన్యాలు ప్రసాదం గారు అర్పించి పూలు రేగుపళ్ళతో ముంగిళ్ళలో అలరించారు. చిన్నపిల్లలకు దోషం లేకుండా రేగుపళ్ళను తలపై పోసి భోగి పళ్ళు పోసినట్టుగా పిల్లలకు ఎలాంటి దోషాలు తగలకుండా కాపాడాలని కోరుకున్నారు. శంకరుడు గృహప్రవేశం చేయాలని గొబ్బెమ్మల చుట్టూ కోలాటం నృత్యాలు చేశారు. మేడారం జాతర సందర్భంగా సంక్రాంతి రావడంతో కోళ్ల పందాలు వేసే వరు కూడా వారి వారి రహస్య స్థావరాలతో పందాలు కొనసాగించినట్లు తెలుపుతున్నారు. గురువారం మకర సంక్రాంతి సందర్భంగా వేడుకలకు తయారు అయ్యేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే ప్రజా ప్రతినిధులు అధికారులు సోషల్ మీడియాలోనూ మరియు బ్యానర్లతోనూ హంగామా సృష్టించారు. ప్రతి కూడలిలోనూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లను ఆవిష్కరించారు. ముందు ముందు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు తమను పరిచయం చేసుకునే విధంగా బ్యానర్లను ఏర్పాటు చేసి ప్రజల్లోకి వచ్చారు. పలు గ్రామపంచాయతీలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి గెలపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -