నవతెలంగాణ -పరకాల : పరకాల పట్టణ కేంద్రంలోని రామాలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా, కమనీయంగా జరిగింది. ధనుర్మాస ముగింపును పురస్కరించుకుని భోగి పండుగ రోజున నిర్వహించే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఆలయ అర్చకులు రమేష్ ఆచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమై.. విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, రక్షాబంధనం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది.ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చిట్టిరెడ్డి సమ్మక్క మాట్లాడుతూ.. ప్రతి ఏటా ధనుర్మాసంలో భోగి రోజున స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఆలయ నిర్వాహకులు చిట్టిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారని పేర్కొన్నారు కళ్యాణం అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరకాల వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి
పరకాలలో వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



