Wednesday, January 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా ముగిసిన శివశంకర్ జాతర..

ఘనంగా ముగిసిన శివశంకర్ జాతర..

- Advertisement -

– అలరించిన కుస్తీ పోటీలు..
నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని రామనాయక్ తండా లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శివ శంకర్ జాతర నిర్వహించారు. జాతర లో భాగంగా బుధువారం  కుస్తీ పోటీలు  నిర్వహిచారు.కుభీర్ మండలంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి మల్లాయోధులు భారీగా తరలి వచ్చి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన మహిళా కుస్తీ పోటీ, ఒంటి చేతి కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షంగా నిల్చయి. ప్రతి ఏడాది అనవయితీ ప్రకారం సంక్రాంతి పర్వదినం రోజు జాతర నిర్వహించి కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తండా వాసులు తెలపరు.ముందుగా సేవాలాల్ జాజదాంబ ఆలయల్లో ప్రత్యేక పూజలు చేసి  కుస్తీ పోటీలు ప్రారంభించారు.ఈ పోటీలను ఎస్ ఐ కృష్ణ రెడ్డి టెంకాయ కొట్టి ప్రారంభించగా గెలుపొందిన మల్ల యోధులకు కమిటీ సభ్యులు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ చవాన్ వందన బాయి, బిక్కు లాల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చవాన్ కుభీర్,సర్పంచ్ కందురు సాయినాథ్ ,అశోక్ చవాన్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ లు గ్రామస్తులు తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -