Saturday, May 24, 2025
Homeజాతీయంసీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఛార్జ్ షీట్‌లో ఈడీ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చింది ఈడీ.

అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) కు చెందిన రూ.2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని తెలిపింది ఈడీ. యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019–22 మధ్యలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి, పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఛార్జ్ షీట్‌లో పేర్కొంది ఈడీ. సాక్షులను విచారించిన తర్వాతనే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్‌లో చేర్చామని, విచారణలో రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని స్పష్టం చేసింది ఈడీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -