Saturday, May 24, 2025
Homeఅంతర్జాతీయంహార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మ‌రో క‌క్ష‌సాధింపు చర్య‌

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మ‌రో క‌క్ష‌సాధింపు చర్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదంతో యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అధ్య‌క్షునిగా ప్ర‌మాణాస్వీకారం చేసి ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముందుగా ఆదేశంలో అక్ర‌మ వ‌ల‌స‌ల క‌ట్ట‌డే ల‌క్ష్యంగా డిపొర్టేష‌న్ పేరుతో అనుమ‌తులు లేకుండా యూఎస్‌లోకి ప్ర‌వేశించిన వ్య‌క్తుల‌పై అమానుషంగా వ్య‌వ‌హ‌రించి..చేతుల‌కు బేడీలు వేసి బ్రెజిల్, కెన‌డా, మెక్సికో తోపాటు భార‌త్ పౌరుల‌ను తిరిగి సైనిక విమానాల్లో స్వ‌దేశాల‌కు సాగ‌నంపారు. ఈక్ర‌మంలో ట్రంప్ తీరుపై ఇంట‌బ‌య‌టా స్వ‌ర‌త్రా విమ‌ర్శ‌లు వెలువెత్తాయి.

అంతేకాకుండా ఆదేశ సుప్రీంకోర్టు కూడా ట్రంప్ నిర్ణ‌యాల‌కు అడ్డ‌క‌ట్ట వేసింది. అదేవిధంగా ఆదేశంలో ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీ హార్వర్డ్.. విదేశీ విద్యార్థుల ప‌ట్ల యూఎస్ ప్రెసిడెంట్ వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ట్రంప్ తీరుతో అమెరికా యూనివ‌ర్సిటీ పేరు ప్ర‌తిష్ట‌లు దిగ‌జారిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీంతో ఆగ్ర‌హించిన ట్రంప్..ఆ విశ్వ‌విద్యాల‌యానికి నిధులు కోత పెడుతు ఆర్డ‌ర్ జారీ చేశాడు. దీంతో అధ్య‌క్షుని నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ఆదేశ న్యాయంస్థానంలో హార్వార్డ్ యూనివ‌ర్సిటీ పిటిష‌న్ దాఖ‌లు విష‌యం తెలిసిందే.

ఆ యూనివ‌ర్సిటీపై క‌క్ష‌పెంచుకున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్..తాజాగా మ‌రో అనుచిత నిర్ణ‌యం తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా… నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హార్వర్డ్ సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోల్యాండ్ సెక్యూరిటీ లేఖ కూడా పంపింది. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు మరో వర్సిటీకి బదిలీ కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే చట్టబద్ధ హోదా కోల్పోతారని కూడా… లేఖలో పేర్కొన్నారు. దీంతో విదేశీ విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -