– నామినేటెడ్ విధానంతో రైతులకు తీవ్ర నష్టం
నవతెలంగాణ-మల్హర్ రావు : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (పీఏసీఎస్) లకు గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు,ప్రజాసంఘాలు, రైతు సంఘాలు కోరుతున్నాయి.జిల్లా పరిధిలో 10 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలున్నాయి. ప్రభుత్వం ఇటీవల పీఏసీఎస్, డీసీసీబీ పాలక వర్గాలను రద్దు చేసింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం నామినేటెడ్ పాలకవర్గాలను నియమిస్తోందనే ప్రచారం ప్రస్తుతం రైతులు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆలోచనను అధికార కాంగ్రెస్ నాయకులు సమర్థిస్తుండగా, ప్రతి పక్ష నాయకులు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నాయి. రైతుల సమస్యలను తెలిసిన వారు, రైతులచే ఎన్నుకోబడిన వారు రైతుల సంక్షేమానికి పని చేస్తారని,నామినేటెడ్ అయిన వారు తమ నాయకుడి మెప్పుకోసమే పని చేస్తారని అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి.
సొసైటీ వ్యవస్థ నిర్వీర్యం..
అక్కల బాపు యాదవ్…ప్రజా సంఘాల నాయకుడు
సొసైటీల్లో నామినేటెడ్ విధానం సరైన పద్ధతి కాదు. జవాబుదారీతనం కొరవడుతోంది. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తేనే రైతులకు న్యాయం జరుగు తుంది. వారి సమస్యలు పరిష్కారమవుతాయి. నామినేటెడ్ విధానంతో పదవి వ్యామోహం తీరుతుందే తప్ప రైతులకు మేలు జరగదు.


