నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలోని ఇప్పటూరు గ్రామంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొన్నది. మకర సంక్రాంతి పర్వదినం రోజు గురువారం ఉదయం గ్రామ ఉపసర్పంచ్ గుర్రం సూరి అలియాస్ బెస్త సూరి (40) గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామ 4వ వార్డు మెంబర్ గా ఎన్నికైన ఆయనను సహచర వార్డు సభ్యులు, సర్పంచ్ ఏకగ్రీవంగా ఉప సర్పంచ్‌గా ఎంపిక చేశారు. చేపల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందే సూరి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో హుటాహుటిన నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని అందువల్ల మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందాడు. మృతుడు సూరి మొదటి భార్యకు నలుగురు ఆడ సంతానం కలరు. సుమారు ఒక సంవత్సరం క్రితం ఆయన మొదటి భార్య మృతి చెందగా.. ఆరు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండవ భార్యతో పాటు ఆయన నలుగురు సంతానంతో కలిసి సూరి చేపల వ్యాపారం చేస్తూ గ్రామంలో జీవించేవారు. గ్రామస్తులందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా ఆయన పని చేసేవారు. గ్రామ సర్పంచుగా పోటీ చేయాలని భావించిన ఆయనకు ఆ అవకాశం రాకపోవడంతో ఉప సర్పంచ్ గా ఆయనకు అవకాశం కల్పించారు.
పండుగ పూట విషాదం..ఉప సర్పంచ్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



