- Advertisement -
నవతెలంగాణ-కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో గ్రామాల్లో సంక్రాంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. బిబిపేట్ మండలంలోని జనగామ గ్రామంలో పండుగ వాతావరణం సందడిగా మారింది. గ్రామంలోని బాలికలు, మహిళలు తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి పండుగ శోభను పెంచారు. వివిధ ఆకృతులు, సంప్రదాయ చిత్రాలతో ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
- Advertisement -



