నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌లో పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలుగుచూసింది. సింహాద్రి, సరోజినీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ (6) తమ ఇంట్లో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వేడి సాంబార్ గిన్నెలో పడింది.
ఒళ్లంతా తీవ్ర గాయాలతో హాహాకారాలు చేస్తున్న చిన్నారిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు సూచనలతో వెంటనే హైదరాబాద్‌కు తరలించగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతితో ఇందిరమ్మ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.



